Tuesday, June 3, 2025

రాజాసాబ్ ప్రభాస్ కథానాయ కుడిగా

 డిసెంబరు 5న




ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'ది రాజాసాబ్ ఒకటి. ప్రభాస్ కథానాయ కుడిగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఎట్టకేలకి విడుదల తేదీని ఖరారు చేసుకుంది. డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ ప్రక టించింది. టీజర్ని ఈ నెల 16న విడుదల చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రమిది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళ విక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తు న్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో రూపొం దుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీక రణ దశలో ఉంది. మంగళవారం, ప్రత్యేకమైన ఓ పోస్టర్ తోపాటు, సినిమా, టీజర్ విడుదల వివరాల్ని ప్రకటించింది నిర్మాణ సంస్థ, "భారీ హంగులతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ గొప్ప అనుభూతిని పంచుతుంది"ని సినీవ ర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్ పళని, సంగీతం: తమన్, కూర్పు: కోట గిరి వెంకటేశ్వరరావు,

No comments:

Post a Comment

Telangana Pension Audit: A Step Toward Transparency

  1. Telangana Pension Audit: A Step Toward Transparency తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న అవకతవకలను నిర్మూ...