కథానాయకుడు పవన్ కల్యాణ్ తన సినిమా చిత్రీకరణల్ని చకచకా పరు గులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే 'హరి హర వీరమల్లు'ను పూర్తి చేసి విడుద లకు సిద్ధం చేసిన ఆయన ప్రస్తుతం 'ఓజీ'ని పూర్తి చేసే పనిలో పడ్డారు. కాగా, ఇప్పుడు తన మరో సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'్ను పునఃప్రారం భించేందుకు సమాయత్తమవుతు న్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల కథానాయిక. అశుతోశ్ రాణా, నవాబ్ షా, గౌతమి తదిత రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల రెండో వారం నుంచి తిరిగి పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ మంగళవారం తిరుపతిలో వెల్లడించారు. ఈ షెడ్యూల్ మొద లైన కొద్దిరోజుల్లోనే పవన్ కూడా ఈ చిత్ర సెట్లోకి అడుగు పెడతారని తెలి సింది. ఇది అన్ని రకాల వాణిజ్య హంగులతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్ధమవుతోంది. పవన్ ఇందులో పవర్ఫుల్ పోలీసు పాత్రలో అలరించను న్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
ustad bhagath singh Glimps Trailer bhagath singh
https://youtu.be/KYuj9hffF20?si=2gh54o4gWhoWbB9R

No comments:
Post a Comment